
వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ మండలంలో మంగళవారం వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు.. పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన దూబని లక్ష్మయ్య(35) తన వ్యవసాయం క్షేత్రంలో పశువుల మేత కోసం గడ్డి కోస్తుండగా.. మోటారుకు అనుసంధానించిన కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య భవాని, కుమారుడు ఉన్నారు. అదేవిధంగా చీదెళ్ల గ్రామానికి చెందిన సురభి సైదులు(46) ఇంట్లోని దండెం తీగకు చేపలు ఎండపెడుతుండగా విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ రెండు ఘటనలకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.

వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి