
కుటుంబ సమస్యలతో ఉరేసుకుని ఆత్మహత్య
గుర్రంపోడు: కుటుంబ సమస్యలతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. చామలేడు గ్రామానికి చెందిన ఆవుల నరేష్(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నరేష్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనికి వెళ్లిన నరేష్ తల్లి ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. కుటుంబ సమస్యలతోనే నరేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.