
ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
భువనగిరి: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జిలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కరించడంతో అధికారులు జాప్యం చేయొద్దన్నారు. ప్రజావాణి ద్వారా మొత్తం 31 అర్జీలను స్వీకరించగా ఇందులో 25 రెవెన్యూ శాఖ, జిల్లా పంచాయతీ, మున్సిపాలిటీ, సర్వే ల్యాండ్, హౌసింగ్, వైద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాష్కర్‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, హోసింగ్ పీడీ విజయసింగ్ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
భువనగిరి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో పల్లె దవాఖానాను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం ప్రజల్లో కల్పించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సాధారణ ప్రసవాల కోసం ప్రోత్సహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు.
కలెక్టర్ హనుమంతరావు