
మరమ్మతులు చేస్తుండగానే పగుళ్లు
మోత్కూరు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్ రోడ్డు కుంగిపోయింది. దీంతో సుమారు 50 మీటర్ల పొడవుతో 2మీటర్లపై లోతుతో కుంగిన చెరువు కట్ట రోడ్డును జేసీబీ సాయంతో తొలగించారు. తిరిగి ఎర్రటి మట్టిని నింపి ప్రతి లేయర్‌ను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. అయినా సోమవారం చిన్నపాటి బుంగతో కట్టంతా లీకై పగుళ్లు పట్టింది. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శివధర్మతేజ, ఈఈ సత్యనారాయణ గౌడ్ చెరువు కట్టను పరిశీలించారు. చెరువు కట్ట తిరిగి కుంగిన విషయాన్ని కలెక్టర్ హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లినట్లు నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.
● మళ్లీ కుంగిన మోత్కూరులోని పెద్ద చెరువు కట్ట