మోగిన సా్థనిక నగారా | - | Sakshi
Sakshi News home page

మోగిన సా్థనిక నగారా

Sep 30 2025 7:17 AM | Updated on Sep 30 2025 7:17 AM

మోగిన సా్థనిక నగారా

మోగిన సా్థనిక నగారా

సాక్షి,యాదాద్రి: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి నగరా మోగింది. అక్టోబరు, నవంబరు మాసాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల 9న తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసి, 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత వచ్చే నెల 13న నోటిఫికేషన్‌ జారీ చేసి, 27న పోలింగ్‌ నిర్వహించేలా షెడ్యూల్‌ విడుదల చేసింది.

బ్యాలెట్‌ బాక్స్‌లు సిద్ధం

ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌ నిర్వహణకు 3,310 బ్యాలెట్‌ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. మూడు విడతల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ప్రతి విడతలో 2240 బ్యాలెట్‌ బాక్స్‌లు సిద్ధం చేశారు. ఇందులో 20 శాతం రిజర్వు చేశారు. పోలింగ్‌ కోసం ఆర్వోలు, ఈఆర్‌వోలు, పీవోలు, ఓపివోలను 20 శాతం రిజర్వుతో కలిపి సిద్ధం చేశారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు ఇలా..

మొదటి విడత: మొదటి విడతలో పది మండలాల్లో 84 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అడ్డగూడూరు(7) మోత్కూరు(5) ఆలేరు(7), ఆత్మకూర్‌(ఎం)(8), బొమ్మలరామారం(11), గుండాల(9), మోటకొండూరు(7), రాజాపేట(11), తుర్కపల్లి(10) యాదగిరిగుట్ట(9) ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2,45,810 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

రెండవ విడత : రెండవ విడతలో ఏడు మండలాల్లో ఏడు జెడ్పీటీసీ, 94 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. బీబీనగర్‌ (14), పోచంపల్లి(10), భువనగిరి(13), వలిగొండ(17) చౌటుప్పల్‌(12), నారాయణపూర్‌ (13) రామన్నపేట(15) మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 1,42,585 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

సర్పంచ్‌ ఎన్నికలు

తొలివిడత: భువనగిరి, చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని ఐదు మండలాల్లో గల 150 గ్రామ పంచాయతీలు, 1332 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఇందులో భువనగిరి (34), పోచంపల్లి ( 21), బీబీనగర్‌ (34), వలిగొండ(37), రామన్నపేట(24)లో తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

రెండవ విడత: రెండు రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని ఆరు మండలాల్లో 127 గ్రామ పంచాయతీలు, 1108 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో చౌటుప్పల్‌ (26),నారాయణపూర్‌ (31), అడ్డగూడూరు( 17), మోత్కూరు(10), గుండాల(20),ఆత్మకూర్‌ ఎం(23) ఉన్నాయి.

మూడవ విడత : భువనగిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆరు మండలాల్లో గల 150 గ్రామ పంచాయతీలు, 1264 వార్డుల్లో మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఆలేరులో (16), రాజాపేటలో (23), యాదగిరిగుట్టలో (23), మోటకొండూరులో (20), బొమ్మలరామారంలో (35), తుర్కపల్లిలో (33) కలిపి మొత్తం 150 చోట్ల ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

రెండు విడతల్లో ఎంపీటీసీ,

జెడ్పీటీసీ ఎన్నికలు

మొదటి దశ వచ్చే నెల 23న,

రెండో దశ 27వ తేదీన

మూడు విడతల్లో జరగనున్న

గ్రామ పంచాయతీ ఎన్నికలు

అమలులోకి ఎన్నికల కోడ్‌

పోలింగ్‌ కేంద్రాలు 3704

ఎన్నికల అధికారుల నియామకం

రెండు విడతల్లో జరిగే ఎన్నికల కోసం ఎన్నికల సిబ్బందిని నియమించారు. 20 శాతం రిజర్వ్‌డ్‌ అఽధికారులతో కలిపి 20 మంది జెడ్పీటీసీ ఆర్వోలు, 81 మంది ఎంపీటీసీ ఆర్వోలు, 81 మంది ఎంపీటీసీ ఏఆర్‌వోలు, మొదటి విడతలో జరిగే ఎన్నికల కోసం 568 ప్రిసైడింగ్‌ అధికారులు, 2980 మంది ఓపీఓలు, రెండవ విడత కోసం 522 ప్రిసైడింగ్‌ అధికారులు, 2980 మంది ఓపీవోలు కలిపి మొత్తం 7402 మందిని ఎంపిక చేశారు. ఇందులో 20 శాతం ఎన్నికల సిబ్బంది రిజర్వ్‌లో ఉంటారు. 1,155 మంది రిజర్వ్‌లో ఉండగా, విధుల్లో మాత్రం 6,889 మంది ఉంటారు. జిల్లాలో 7402 మంది అంటే 513 మంది అదనంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement