
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
భూదాన్‌పోచంపల్లి: ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ ఏసీపీ పి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ర్యాగింగ్ వలన విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడమే కాకుండా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నియంత్రణకు యాజమాన్యాలు యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. నూతనంగా చేరిన విద్యార్థుల పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ప్రతిఒక్కరూ ర్యాగింగ్ సంస్కృతిని నిర్మూలించుటకు కృషి చేయాలని కోరారు. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలపై 1930 లేదా 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. అనంతరం ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఫొటో మార్ఫింగ్ వంటి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుబ్బారావు, స్థానిక ఎస్‌ఐ కంచర్ల భాస్కర్‌రెడ్డి, సైబర్ వారియర్ అంకిత, యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ మారగోని వెంకటేశం ఆయా విభాగాల డీన్లు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి