
రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది
మిర్యాలగూడ: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, పోలీసులను అడ్డం పెట్టుకోని సీఎం రేవంతరెడ్డి పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. యూరియా కోసం ధర్నా చేస్తే తనను నడవలేని స్థితిలో పోలీసులు కొట్టారని ఆరోపించిన దామరచర్ల మండలం కొత్తపేటతండాకు చెందిన ధనావత్ సాయిసిద్ధును బుధవారం జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. యూరియా కోసం ధర్నా చేస్తే దళితుడు అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా కొడతారా అని ప్రశ్నించారు. సాయిసిద్ధును విపరీతంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా ఎస్పీ.. పోలీసులను వెనుకేసుకుని వస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఎస్పీలు కూడా కాంగ్రెస్ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి కొడుతున్నారని అన్నారు. రైతులకు కనీసం యూరియా ఇవ్వలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. అడవిదేవులపల్లిలో యూరియా కోసం లైన్‌లో నిలబడి గాయపడిన గిరిజన మహిళా రైతు చికిత్స పొందుతూ మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా అందించకుండా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. మిర్యాలగూడలో యూరియా లారీలను పక్కదారి పట్టిస్తున్నారని, ఎమ్మెల్యేలే యూరియా దందా చేస్తున్నారని అన్నారు. బాధితుడు సాయిసిద్ధును, అతడి కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని, బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు నల్లమోతు సిద్దార్ధ, దుర్గంపూడి నారాయణరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలాజీనాయక్, ఆంగోతు హాతీరాంనాయక్, కుందూరు వీరకోటిరెడ్డి, బాబయ్య, కుర్ర శ్రీనునాయక్, ధనావత్ ప్రకాశ్‌నాయక్, లింగానాయక్, పీసీకే ప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఆరోపణలు అవావస్తం
నల్లగొండ: వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో యువకుడిపై ఎస్‌ఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బుధవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన వార్త అవాస్తవమని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్త రాయొద్దని ఆయన కోరారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి