
గెలుపు.. ‘రుచి’త చూసింది
కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన ఎల్లబోయిన రుచిత గ్రూప్–1 తుది ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగం సాధించింది. మిర్యాలగూడ మండలం మొలకల పట్నం గ్రామానికి చెందిన ఎల్లబోయిన రవి, శోభ దంపతులు 30 ఏళ్ల క్రితం కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి వలస వచ్చి వెటర్నరీ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. వారి ఏకై క కుమార్తె రుచిత హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేసి ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంది. ఈ క్రమంలో గ్రూప్–1 రాసి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికై ంది. కలెక్టర్ కావాలనే రుచిత కోరికను తాము ఎంతో ప్రోత్సహించామని, నిత్యం 14 గంటల పాటు చదివిన కష్టానికి మంచి ఫలితం దక్కిందని ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కుమార్తెకు స్వీట్స్ తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.