
నా ఆరేళ్ల కష్టం..
చిలుకూరు: చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి రోహిళారెడ్డి గ్రూప్–1 తుది ఫలితాల్లో డీఎస్పీ పోస్టుకు ఎంపికై ంది. ఆమె తండ్రి దొంతిరెడ్డి శ్యామ్‌సుందర్‌రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా పనిచేస్తున్నారు. రోహిళారెడ్డి వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో బీటెక్ పూర్తిచేసింది. బీటెక్ ఫైనలియర్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చినప్పటికీ.. 2019 నుంచి గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతూ గ్రూప్–1 రాసి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికై నట్లు ఆమె పేర్కొన్నారు.