
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ–కొండ్రపోల్ మధ్య రైలు పట్టాలపై బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి చైన్నె ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లడంతో రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు కోలముఖంతో 6.5 అడుగుల ఎత్తు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. తెలుపు రంగు షర్టు, జీన్స్ ప్యాంట్ ధరించినట్లు పేర్కొన్నారు. నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ రైల్వే ఎస్‌ఐ బొడిగె రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.