
సొంత ప్రిపరేషన్‌తో..
కోదాడ: గ్రూప్–1 తుది ఫలితాల్లో మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన పోటు ఉపేందర్‌రావు, సత్యావతి దంపతుల కుమారుడు సంకీర్త్ ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అంతేకాకుండా గ్రూప్–2లో 642వ ర్యాంకు సాధించగా.. గ్రూప్–4 రాసి రెవెన్యూ విభాగంలో ఉద్యోగం సాధించారు. సివిల్స్ 2025 మెయిన్స్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎంపీడీఓ ఉద్యోగం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని సంకీర్త్ పేర్కొన్నారు. సొంతంగా నోట్స్ తయారు చేసుకుని, స్టాండర్డ్ బుక్స్ చదివి తాను ఉద్యోగం పొందినట్లు తెలిపారు. ఉద్యోగ సాధనలో తన తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేదనిదన్నారు.