
జూనియర్ అసిస్టెంట్ నుంచి ఎంపీడీఓగా..
పెద్దవూర: : గ్రూప్–1 ఫలితాల్లో మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కత్తి శివశంకర్‌రెడ్డి ఎంపీడీఓగా ఎంపికయ్యారు. శివశంకర్‌రెడ్డి స్వస్థలం పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామం. శివశంకర్‌రెడ్డి చిన్నతనంలోనే అతడి తండ్రి రాంచంద్రారెడ్డి మృతిచెందారు. దీంతో తల్లి పద్మ వ్యవసాయం చేస్తూ శివశంకర్‌రెడ్డితో పాటు అతడి చెల్లిని చదివించింది. బీటెక్ పూర్తిచేసిన శివశంకర్‌రెడ్డి ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గ్రూప్–4లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. జూనియర్ అసిస్టెంట్‌గా తన బాధ్యతలను నిర్వహిస్తూనే గ్రూప్–1 పరీక్షలకు పట్టుదలతో సన్నద్ధమై అనుకున్న ఎంపీడీఓ ఉద్యోగాన్ని సాధించారు. అతడు రెండు పర్యాయాలు సివిల్స్ మెయిన్స్‌కు కూడా అర్హత సాధించారు. తన కుమారుడికి గ్రూప్–1 ఉద్యోగం రావడంతో అతడి తల్లి సంతోషం వ్యక్తం చేస్తోంది.