
అనాథ నుంచి డీఎస్పీ స్థాయికి..
గుర్రంపోడు: చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయినా కష్టపడి గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించారు గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన ముడుసు శ్రీకాంత్. అతడి తల్లిదండ్రులు భిక్షమయ్య, చెన్నమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో శ్రీకాంత్‌ను, అతడి తమ్ముడు కృష్ణకాంత్‌కు కొండమల్లేపల్లిలోని సోలిడార్ తెలంగాణ అనే స్వచ్ఛంద సంస్ధ అండగా నిలిచి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదివించడమేగాక గ్రూప్స్ కోసం శిక్షణ ఇప్పించింది. శ్రీకాంత్ ట్యూషన్లు చెప్పుకుంటూ నిజాం కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2014లో రైల్వేలో టెక్నికల్ ఆఫీసర్‌గా, 2018లో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ కలెక్టర్ కావాలని ఆ ఉద్యోగాల్లో చేరకుండా గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో చేరి పట్టుదలతో చదివి గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో ఎస్సీ కేటగిరిలో ఆరో సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు.