
నిజాయితీ చాటుకున్న పెట్రోల్ బంక్ సిబ్బంది
ఫ రూ.2 లక్షలు విలువైన బంగారం, వెండి ఉన్న బ్యాగు
బాధితుడికి అప్పగింత
హాలియా: పెట్రోల్ బంక్‌లో పోగొట్టుకున్న రూ.2 లక్షల విలువైన బంగారం, వెండిని బాధితులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది. ఈ సంఘటన హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఏఎస్‌ఐ రామయ్య, బంక్ మేనేజర్ సోమనబోయిన లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కవిటి బ్రహ్మచారి హాలియాలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం అదే బంక్‌లో బైక్ టైర్లలో గాలి చెక్ చేయించుకునే క్రమంలో బంగారం, వెండి ఉన్న బ్యాగ్‌ను బంక్‌లో ఉంచి వెళ్లిపోయారు. బంక్ సిబ్బంది గమనించి బ్యాగ్‌ను బంక్ మేనేజర్ లింగయ్యకు అప్పగించారు. బ్యాగులో దొరికిన వివరాల ఆధారంగా బ్యాగ్ బ్రహ్మచారిదని తెలుసుకొని హాలియా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో బుధవారం బ్రహ్మచారికి బ్యాగ్‌ను తిరిగి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న బంక్ సిబ్బందికి బ్రహ్మచారి కృతజ్ఞతలు తెలుపగా.. పోలీసులు అభినందించారు.