
షార్ట్ సర్క్యూట్‌తో బేకరీ దగ్ధం
గరిడేపల్లి: షార్ట్ సర్క్యూట్‌తో బేకరీ దగ్ధమైంది. ఈ ఘటన గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య నాగరాజు అనే వ్యక్తి గడ్డిపల్లి గ్రామంలో నందిని బేకరీ షాపు నిర్వహిస్తున్నాడు. నాగరాజు, అతడి భార్య ఇద్దరు కలిసి బేకరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో అకస్మాత్తుగా బేకరీలో షార్ట్ సర్క్యూట్‌తో జరిగి పొగలు వచ్చాయి. కొద్దిసేపటికే బేకరీ మొత్తం దగ్ధమైంది. ఫర్నీచర్‌తో పాటు సుమారు రూ.5లక్షల విలువైన వస్తువులు కాలిపోయాయని బాధితుడు వాపోయాడు.
బైక్ ఢీకొని మృతి
మిర్యాలగూడ: దామరచర్ల మండలం వీరభద్రపురం గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందినట్లు వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.