ఇళ్లకు పయనం | - | Sakshi
Sakshi News home page

ఇళ్లకు పయనం

Sep 21 2025 5:38 AM | Updated on Sep 21 2025 5:38 AM

ఇళ్లక

ఇళ్లకు పయనం

న్యూస్‌రీల్‌

సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆదివారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పోరాటం

భువనగిరి: పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తామని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి అన్నారు. శనివారం భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పెన్షనర్‌ సంఘటితంగా ఉండి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలన్నారు. పెన్షనర్ల హెల్త్‌కార్డుల సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందన్నారు. అనంతరం పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాలరాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు జిట్ట భాస్కర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు బాలేశ్వర్‌, జగన్మోహన్‌ భిక్షపతి, అంబేద్కర్‌, రామనర్సయ్య, అంజయ్య పాల్గొన్నారు.

చదువుతోనే భవిష్యత్‌

యాదగిరిగుట్ట: చదువుతోనే భవిష్యత్‌ ఉంటుందని, ఉన్నతులుగా ఎదగాలంటే పట్టుదలతో చదవాలని స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ పుల్లయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్‌ డేలో ఆయన పాల్గొని మాట్లాడారు. గుట్ట పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. అనంతరం కళాశాల నుంచి 2024–25లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్‌పీడీసీఎల్‌ డీఈ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

‘బృందావన్‌’ గేట్ల

మరమ్మతులకు మంత్రి హామీ

మోత్కూరు: బృందావన్‌ కాలువ బ్రిడ్జి గేట్లకు మరమ్మతులు చేయాలని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్‌, విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యశర్మ, సూరోజు భాస్కరాచారి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. శనివారం మంత్రిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన గేట్లు తుప్పు పట్టి పనిచేయడం లేదన్నారు. కాలువ కంప చెట్లతో నిండిందని, వంతెనలు కూలి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయని వివరించారు. కాల్వను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు వారు తెలిపారు.

ఎయిమ్స్‌లో ‘యోగా’

బీబీనగర్‌: స్వస్త్‌నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం బీబీనగర్‌ ఎయిమ్స్‌ వైద్య కళాశాలలో హౌస్‌కీపింగ్‌ మహిళలకు యోగా తరగతులు నిర్వహించారు. యోగాసనాలు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అహంతేమ్‌ శాంతాసింగ్‌, డీన్‌ నితిన్‌జాన్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ అభిషేక్‌ అరోరా, యోగా నోడల్‌ అధికారి గోవిందరావు, యోగా శిక్షకురాలు నీరజ, వందన పాల్గొన్నారు.

రామన్నపేట : కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిధిలో 12 చోట్ల కేంద్రాలు తెరిచే అవకాశం ఉంది. వీటిని జిన్నింగ్‌ మిల్లుల్లో ఏర్పాటు చేయనున్నారు. మిల్లుల్లో వే బ్రిడ్జిలు, కంప్యూటర్లు, ఇతర వసతులను పరిశీలించి సీసీఐకి నివేదిక అందజేశారు.

గత ఏడాది కంటే అధికంగా పత్తి సాగు

జిల్లాలో 1,13,193 ఎకరాల్లో పత్తి సాగైంది. గత ఏడాదితో పోలిస్తే 4,337 ఎకరాల్లో అధికంగా సాగు చేశారు. ఎకరాకు సగటున పది క్వింటాళ్ల చొప్పున 11,31,930 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

టార్గెట్‌ పెరిగే అవకాశం

జిల్లాలో పత్తి సాగు పెరగడం, చేలు ఆశాజనకంగా ఉండటంతో గత ఏడాది కంటే మెరుగైన దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది 12 కేంద్రాల ద్వారా 6,49,318 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు.ఈసారి లక్ష్యం పెరిగే అవకాశం ఉన్నది. మద్దతు ధర క్వింటాకు గరిష్టంగా రూ.8,110 పెంచడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రైవేట్‌ వ్యాపారులకు కాకుండా సీసీఐ కేంద్రాల్లోనే పత్తి విక్రయానికి మొగ్గుచూపే అవకాశం ఉన్నది.

మిల్లులు ఇవీ..

గత సంవత్సరం కేటాయించిన జిన్నింగ్‌ మిల్లుల్లోనే ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆలేరు మార్కెట్‌ పరిధిలోని మల్లికా ర్జున కాటన్‌ ఇండ్రస్టీస్‌(ఆలేరు), శ్రీనిధి కాటన్‌ ఇండస్ట్రీట్స్‌(శారాజీపేట), భువనగిరి మార్కెట్‌ పరిధి లోని విజయలక్ష్మి స్పిన్‌టెక్స్‌, సూర్యవంశీ జిన్నింగ్‌ మిల్‌, చౌటుప్పల్‌ మార్కెట్‌ పరిధిలోని కావేరి జిన్నింగ్‌ ఇండస్ట్రీట్స్‌, ప్రగతి కాటన్‌ ఇండస్ట్రీట్స్‌, మోత్కూరు మార్కెట్‌ పరిధిలోని నటరాజ్‌ జిన్నింగ్‌ ప్రెస్సింగ్‌మిల్‌ (దత్తప్పగూడెం), మహాలక్ష్మీ కాట్‌స్పిన్‌ ఇండస్ట్రీట్స్‌(అనాజిపురం), గాయత్రీ కాటన్‌ ఇండ్రస్టీట్స్‌(కాటెపల్లి), సిద్ధేశ్వర కాటన్‌ ఇండస్ట్రీట్స్‌(ఆత్మకూరు), వలిగొండ మార్కెట్‌ మార్కెట్‌ పరిధి లోని ఎస్‌టీఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, వెంకటేశ్వర శ్రీసాయి జిన్నింగ్‌ మిల్లులో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. జిన్నింగ్‌ మిల్లుల్లో వేబ్రిడ్జీలు, కంప్యూటర్లు, ఇదర మౌలిక వసతులను పరిశీలించి సీసీఐకి నివేదిక అందజేశారు. త్వరలో టెండర్లు వేసి అర్హత

భువనగిరి: విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో చదువులకు కొన్ని రోజులు విరామం లభించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలకు అదివారం నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంతో వసతి గృహాలు, అద్దె గదుల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు శనివారం సాయంత్రం నుంచే ఇంటిబాట పట్టారు. దీంతో భువనగిరి ఆర్టీసీ బస్టాండ్‌ రద్దీగా మారింది. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు.

నృసింహుడికి నిత్యారాధనలు

యాదగిరిగుట్ట: పంచనారసింహులు కొలువైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సంప్రదాయ పర్వాలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకార మూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయంలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు.

సీసీఐ ఆధ్వర్యంలో 12 కేంద్రాలు

జిన్నింగ్‌ మిల్లుల్లో వసతులను

పరిశీలించి సీసీఐకి నివేదిక

ఇచ్చిన మార్కెటింగ్‌ అధికారులు

11,31,930 క్వింటాళ్ల దిగుబడి

వస్తుందని అంచనా

క్వింటాకు రూ.8,110 మద్దతు

ధర ప్రకటించిన కేంద్రం

పత్తి విక్రయించాలంటే

స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి

కొనుగోళ్లలో కొత్త రూల్‌

సీసీఐ కేంద్రాల్లో రైతులు పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలంటే ఈ ఏడాది కొత్త రూల్‌ తీసుకువచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన కపస్‌ కిసాన్‌ యాప్‌లో రైతులు తాము సాగు చేసిన పంట వివరాలు నమోదు చేస్తే బుకింగ్‌ నంబర్‌ వస్తుంది. దీని ఆధారంగా ఆన్‌లైన్‌, స్మార్ట్‌ ఫోన్ల ద్వారా స్లాట్‌ బుక్‌ చేయాలి. దీని వల్ల రైతులు రోజుల తరబడి నిరీక్షించకుండా నిర్దేశిత సమయానికి కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకెళ్లి విక్రయించవచ్చు. ఏ కారణం చేతనైనా నిర్ధేశించిన రోజు పత్తి తీసుకెళ్లనట్లయితే స్లాట్‌ రద్దువుతుంది. అంతేకాకుండా నూతన విధానం వల్ల నిజమైన రైతులు మాత్రమే సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశం ఉంటుంది.

రైతులు తాము పండించిన పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీసీఐ టెండర్లలో అర్హత పొందిన జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. రైతులు సీసీఐ కేంద్రాల్లోనే పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలి. దళారులను నమ్మి మోసపోవద్దు.

– సబిత, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

ఇళ్లకు పయనం1
1/7

ఇళ్లకు పయనం

ఇళ్లకు పయనం2
2/7

ఇళ్లకు పయనం

ఇళ్లకు పయనం3
3/7

ఇళ్లకు పయనం

ఇళ్లకు పయనం4
4/7

ఇళ్లకు పయనం

ఇళ్లకు పయనం5
5/7

ఇళ్లకు పయనం

ఇళ్లకు పయనం6
6/7

ఇళ్లకు పయనం

ఇళ్లకు పయనం7
7/7

ఇళ్లకు పయనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement