
ఎన్నికల హామీలు అమలు చేయాలి
భువనగిరిటౌన్: ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్రంలోని 584 మండలాల ఉద్యమకారులు చేపట్టిన చైతన్యయాత్ర శనివారం భువనగిరికి చేరుకుంది. ఆమరవీరుల స్థూపం వద్ద ఫోరం ప్రతినిధులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్‌న్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 250 చదరపు గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్, గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, రూ.10 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. హామీలను నెరవేర్చకుంటే మరోపోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ చైర్మన్ జిల్లా శీలం స్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రతినిధులు చంద్రభాను, జోక్ అంజన్న, చాంద్ పాషా, గగన్‌కుమార్, జానకిరెడ్డి, రజినీకాంత్ రెడ్డి, దయానంద్, వీరస్వామి, జగన్ యాదవ్ మల్ల మ్మ, శివ్‌కుమార్ నేత, శ్రీధర్ సంధ్య పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్