
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
ఆలేరురూరల్: ఆలేరు తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి తనిఖీ చేశారు. భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. 22ఏ, రేషన్ కార్డులు, ఎలక్షన్స్ క్‌లైయిమ్స్‌ను పరిశీలించి సూచనలు చేశారు. ఓటరు జాబితా రూపకల్పన పారదర్శంగా ఉండాలని బూత్ లెవల్ ఆఫీసర్లకు స్పష్టం చేశారు. డబుల్ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, ఆర్‌ఐ పూర్ణచందర్‌రావు, తదితరులుపాల్గొన్నారు.