అప్పులు చేసి.. భోజనం! | - | Sakshi
Sakshi News home page

అప్పులు చేసి.. భోజనం!

Sep 21 2025 5:38 AM | Updated on Sep 21 2025 5:38 AM

అప్పు

అప్పులు చేసి.. భోజనం!

హాస్టల్‌ నిర్వహణ కష్టంగా మారింది

ఇంటి వద్దనుంచి పంపుతున్నారు

ఆలేరు: షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ వసతిగృహాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆరు నెలలుగా భోజన బిల్లులు ఆగిపోవడంతో హాస్టళ్ల నిర్వహణ వార్డెన్లకు భారంగా మారింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, గుడ్లు, పండ్లు, గ్యాస్‌ ఇలా.. ప్రతి వస్తువు కొనుగోలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదో విధంగా సరుకులు తెస్తున్నా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టలేకపోతున్నామని వార్డెన్లు వాపోతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులో జరుగుతున్న జాప్యం వల్ల బిల్లుల చెల్లింపులు ఆగిపోతున్నాయని తెలుస్తోంది.

జిల్లాలో 21 ఎస్సీ వసతి గృహాలు

3వ తరగతి నుంచి 10వ తరగతికి చెందిన ప్రీమెట్రిక్‌ ఎస్సీ వెల్ఫేర్‌ హాస్టళ్లు జిల్లాలో 19 ఉన్నాయి. ఇందులో 1,100 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ఇంటర్మీడియట్‌ నుంచి ఉన్నత విద్యను అభ్యసించే పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు 2 ఉండగా, వాటిలో 250మంది విద్యార్థులు ఉన్నారు.

రూ.92.40లక్షలు పెండింగ్‌.. ఈ ఏడాది మార్చి నుంచి మే నెల మినహాయిస్తే సెప్టెంబర్‌ వరకు ఆరు నెలల భోజన బిల్లులు ఆగిపోయాయి. ప్రీమెట్రిక్‌ విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.1,400, పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు రూ.2,100 చొప్పున సుమారు రూ.92.40 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. ఇప్పటికే అప్పులు చేసి ఎలాగో అలా వసతి గృహాలను నెట్టుకొస్తున్న హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారు(హెచ్‌డబ్ల్యూఓ)లు ఇక ఆర్థిక భారాన్ని మోయలేమంటున్నారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించని పక్షంలో హాస్టళ్ల నిర్వహణ కష్టమని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్టీ,బీసీ ఇతర హాస్టళ్లలోనూ ఇదే పరిిస్థతి ఉన్నట్లు తెలుస్తోంది.

ఐదారు నెలలుగా బిల్లులు వస్తలేవు.అప్పు చేసి పిల్లలకు భోజనం పెడుతున్నాం. పెండింగ్‌ బిల్లులు రానిపక్షంలో ఇక ముందు హాస్టల్‌ నిర్వహణ, డైట్‌ కొనసాగించడం కష్టంగా మారుతుంది. హెచ్‌డబ్ల్యూఓలు ఆర్థిక ఇబ్బందులు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు ఉన్నతాఽధికారులు చొరవ చూపాలి.

–శైలజ,హెచ్‌డబ్ల్యూఓ,ఆలేరు బాలికల హాస్టల్‌

కాస్మొటిక్‌ బిల్లులకూ బ్రేక్‌

విద్యార్థుల కాస్మొటిక్‌ బిల్లులకూ బ్రేక్‌ పడింది.11ఏళ్ల వయసు లోపు విద్యార్థినులకు నెలకు రూ.175, 12 ఏళ్ల పైబడిన వారికి రూ.275 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే విధంగా 11ఏళ్ల లోపు బాలురకు రూ.150, 12 సంవత్సరాలు నిండిన బాలురకు రూ.200 అందజేస్తుంది. ఐదు నెలలుగా కాస్మొటిక్‌ బిల్లులు రాకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు నెలనెలా రూ.150, రూ.250 పంపిస్తుండటం గమనార్హం.

సంక్షేమ హాస్టళ్లకు ఆరు

నెలలుగా అందని డైట్‌ బిల్లులు

రూ.లక్షల్లో పేరుకుపోయిన బకాయిలు

ఉద్దెరకు సరుకులు తెస్తున్న వార్డెన్లు

ఆర్థిక ఇబ్బందులతో సతమతం

అవుతున్నామని ఆవేదన

ఐదు నెలలుగా కాస్మొటిక్‌ బిల్లు రావడం లేదు. నెలకు రూ.275 చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బిల్లులు రాకపోవడంతో మా తల్లిదండ్రులు ప్రతి నెలా రూ.150 నుంచి రూ.250 వరకు పంపిస్తున్నారు. వాటితో సబ్బులు, టూత్‌ఫేస్ట్‌ ఇతర వస్తువులు కొంటున్నా.

– జి.నవ్యశ్రీ, 8వ తరగతి, ఆలేరు ఎస్సీ హాస్టల్‌

అప్పులు చేసి.. భోజనం!1
1/2

అప్పులు చేసి.. భోజనం!

అప్పులు చేసి.. భోజనం!2
2/2

అప్పులు చేసి.. భోజనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement