
ఆత్మహత్యలు జరిగితేనే జీతాలు వేస్తారా
సూర్యాపేటటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు జరిగితేనే జీతాలు వేస్తారా అని బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి రాంబాబు ప్రశ్నించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేకపోతే వారు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రాష్ట్ర బృందంతో కలిసి శుక్రవారం పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మధు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్, మెడికల్ అండ్ హెల్త్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ, జిల్లా అధ్యక్షుడు చికూరి అశోక్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, అమరవాది శ్రవణ్ పాల్గొన్నారు.
ఫ బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు