
వాతావరణ మార్పులపై అవగాహన అవసరం
ఫ యాక్షన్ ఎయిడ్ ప్రోగ్రాం
లీడ్ డాక్టర్ ఇర్ఫాన్
భువనగిరి: వాతావరణ మార్పులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని యాక్షన్ ఎయిడ్ ప్రోగ్రాం లీడ్ డాక్టర్ ఇర్ఫాన్ పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరిలోని ఎస్సీ గురుకుల పాఠశాల, కళాశాలలో యాక్షన్ ఎయిడ్ కర్నాటక ప్రాజెక్టు ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రకృతి, పర్యావరణ పట్ల అవగాహన కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. శబ్ద, వాయు కాలుష్య నివారణతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అడవుల విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ కర్నాటక ప్రాజెక్టు కమ్యూనిటీ ట్రైనర్ సురుపంగ శివలింగం, ప్రిన్సిపాల్ వెంకన్న, వైస్ ప్రిన్సిపాల్ శ్యాంబాబు, యాక్షన్ ఎయిడ్ వలంటీర్లు చంద్రకళ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.