స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడి మృతి

Sep 20 2025 6:48 AM | Updated on Sep 20 2025 6:48 AM

స్కూల

స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడి మృతి

డీఈఓ విచారణ

పెద్దవూర: బాలుడిని స్కూల్‌ బస్సు ఢీకొట్టడంతో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం కంబాలదిన్నె గ్రామానికి చెందిన కుమ్మరి చంద్రశేఖర్‌ తన భార్య శ్రీదేవి, ఇద్దరు పిల్లలతో కలిసి గత ఆరు నెలలుగా పెద్దవూర మండల కేంద్రంలోని రంగప్పకాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్‌ గ్రామాల్లో కిరాణ దుకాణాలకు సరుకులను బైక్‌పై తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. వీరి పెద్ద కుమారుడు గౌతమ్‌ చక్రశాలి(7) మండల కేంద్రంలోని ప్రైవేట్‌ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ప్రతిరోజు పాఠశాలకు స్కూల్‌ బస్సులోనే వెళ్తుంటాడు. గౌతమ్‌ గురువారం ఉదయం స్కూల్‌ బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో బస్సు డ్రైవర్‌ బాషిపాక అశోక్‌ బాలుడిని గమనించకుండా బస్సును ముందుకు పోనివ్వడంతో గౌతమ్‌ రోడ్డుపై పడిపోయాడు. ఈ క్రమంలో బస్సు ముందు టైరు విద్యార్థిపైకి ఎక్కడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి, అక్కడి నుంచి నల్లగొండలోని నిమ్స్‌కు తరలించారు. హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. బాలుడి తండ్రి చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు పాఠశాల బస్సు డ్రైవర్‌ అశోక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు.

న్యాయం చేయాలని ధర్నా

డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని శుక్రవారం పాఠశాల ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్‌, ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ముందిగొండ వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జగదీష్‌, రమేష్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆదిమళ్ల సత్యనారాయణ, చిన్న, నాగార్జున, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆదేశానుసారం జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి శుక్రవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి వెళ్లి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. అనంతరం పాఠశాలకు చేరుకుని రికార్డులను పరిశీలించారు. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉషశ్రీ స్కూల్‌ బస్సుకు సంబంధించిన ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్సు, పొల్యూషన్‌, బస్సు కండిషన్‌ను పరిశీలించారు.

ఫ పాఠశాల ఎదుట కుటుంబ

సభ్యులు, విద్యార్థి సంఘాల ధర్నా

స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడి మృతి1
1/1

స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement