
పటేల్‌తోనే తెలంగాణకు విముక్తి
భువనగిరి: జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం తెలంగాణ విమోచన దినం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. సర్దార్ వల్లభబాయ్ పటేల్‌తోనే తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించందన్నారు. తెలంగాణ విమోచన కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా, కాటూరి అచ్చయ్య, కొప్పుల యాది రెడ్డి, ఉపాధ్యక్షులు గూడూరు నరోత్తంరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, వైజయంతి, కోటేష్, సీనియర్ నాయకులు మాయ దశరథ, రత్నపురం బలరాం, డీఎల్‌ఎన్‌గౌడ్, నరసింహరావు, రామకృష్ణ, ఊదరి లక్ష్మి, మల్లిక, కృష్ణాచారి, మహమూద్, సతీష్, రాజు, వెంకటేష్ పాల్గొన్నారు.