
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ అతిథిగా ‘గుత్తా’
సాక్షి, యాదాద్రి: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించే కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు జాతీయ పతాకం ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు.
పవర్ లిఫ్టింగ్‌లో జాతీయస్థాయికి
గుండాల: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జి.శిరీష యోగా, పవర్ లిప్టింగ్‌లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉద్యోగ నిర్వహణలో ఒత్తిళ్లను అధిగమించాలంటే దిన చర్యలో భాగంగా వ్యాయామం, ఆటలు ఉండాలనే ఉద్దేశంతో ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో ఆమె పాల్గొన్నారు. పది యోగాసనాలు వేసి, 80 కేజీల పవర్ లిప్టింగ్ విభాగంలో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నది తన ఉద్దేశమని, వారిలో స్ఫూర్తి నింపేందుకు సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో పాల్గొన్నట్లు శిరీష తెలిపారు. జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల శిరీషను సహచర ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ అభినందించారు.
ఉద్యమకారుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా
ఆలేరు: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డికి తీసుకువెళతానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. సోమవారం ఆలేరులో ఎమ్మెల్యేను మలిదశ ఉద్యమకారుల జేఏసీ నాయకులు కలిశారు. ఎన్నికల హామీ ప్రకారం ఫించన్‌తోపాటు ఆరోగ్యబీమా కార్డులు, 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యేను కలిసి వారిలో జేఏసీ కన్వీనర్ మొరిగాడి వెంకటేష్, కో–కన్వీనర్లు ఇక్కిరి శ్రీనివాస్,ఆడెపు బాలస్వామి, ఎనగందుల సురేష్,బందెల సుభాష్ ఉన్నారు.
చదువుతోనే భవిష్యత్
చౌటుప్పల్ రూరల్: చదువుతోనే మంచి భవి ష్యత్ ఉంటుందని డీసీపీ అక్షాంశ్‌యాదవ్ పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని 250 మంది విద్యార్థులకు ప్రకాశం పంతులు ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీ ట్రస్ట్ సమకూర్చిన రూ.1.20 లక్షల విలువైన యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ పటోళ్ల మధుసూధన్‌రెడ్డి, ఎంఈఓ ఎలికట్టె గురువరావు, ట్రస్ట్ చైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ పి.మెహన్‌రావు, ప్రకాశం పంతులు మనువడు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి టంగుటూరి శ్రీరామ్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, గట్టు ప్రియాంక, ఉపాధ్యాయులు శివజ్యోతి, ఉస్మాన్, శ్రీలత, అంజయ్య, నిర్మల, రాణి, కవిత, శారద, విజయలక్ష్మి, విజయ పాల్గొన్నారు.
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
సాక్షి యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ అతిథిగా ‘గుత్తా’

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ అతిథిగా ‘గుత్తా’