
వామ్మో..జగదేవ్‌పూర్ చౌరస్తా
కళ్లెదుటే ప్రమాదాలు జరుగుతున్నాయి
నిత్యకృత్యంగా ప్రమాదాలు
ఫ ఇరువైపులా ఆక్రమణలు,
అధ్వానంగా రోడ్లు
ఫ నెల రోజుల వ్యవధిలోనే
ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలోని జగదేవ్‌పూర్ చౌరస్తా ప్రమాదకరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ చౌరస్తా ఆక్రమణలతో ఇరుకుగా మారడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ నెల రోజుల వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు.
రెండు జాతీయ రహదారులకు అనుసంధానం
వరంగల్ – హైదరాబాద్, భువనగిరి – ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారులకు జగదేవ్‌పూర్ చౌరస్తా అనుసంధానంగా ఉంటుంది. ఇక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది.మితిమీరిన వేగంతో రావడంతో ప్రమాదాలు జరుగుతుంటా యి. ఆగస్టు 3న లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈనెల 12న జరిగిన ప్రమాదంలో బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, ఒకరు గాయపడ్డారు.
పరిశీలించిన అదనపు కలెక్టర్
జగదేవ్‌పూర్ చౌరస్తాను అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.. ఎన్‌హెచ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ రామలింగంతో కలిసి సోమవారం పరిశీలించారు. ఆక్రమణలను తొలగించి, మా ర్కింగ్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఇదొక్కటే మార్గమని, ప్రజలు సహకరించాలని కోరారు.
జగదేవ్‌పూర్ చౌరస్తాలో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. మా కళ్లేదుటే రోడ్డు ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు పోతుంటే భయాందోళనకు గురవుతున్నాం. అధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.
–హరిశంకర్, ఆటోడ్రైవర్

వామ్మో..జగదేవ్‌పూర్ చౌరస్తా