
రాతి గోడలతో రాజకోట
రాజాపేట: రాజాపేట మండల కేంద్రంలో 250 ఏళ్ల క్రితం రాజుల కాలంలో నిర్మించిన రాజకోట ఇన్నేళ్లవుతున్నా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. రాజరాయన్న 1775లో ఈ రాజకోటను రాతి గోడలతో నిర్మిచారు. అప్పటి నిజాం పాలకులు సంస్థాన్ నారాయణపురం, సంస్థాన్ రాజాపేట కోటను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని పరిపాలించారు. ప్రజా పాలన కోసం తమ రక్షణ కోసం అప్పటి శాసీ్త్రయ పద్ధతిలో ఈ కోటను శత్రుదుర్భేధ్యంగా నిర్మించారు. ఇందుకు గాను డంగుసున్నంతో పెద్దపెద్ద రాళ్లతో కోటగోడలు నిర్మించారు. ఈ రాజకోట బురుజులు, ఎత్తైన ప్రాకారాలతో ఉంది. శత్రువులు రాకుండా కందకాల్లో మొసళ్లను పెంచేవిధంగా సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామం చుట్టూ ఒక పద్ధతిగా కందకాలను ఏర్పాటు చేశారు.