
ప్రపంచ దేశాలకు ఆదర్శంగా సనాతన ధర్మం
సూర్యాపేట: ప్రపంచ దేశాలకు ఆదర్శంగా సనాతన ధర్మం నిలుస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో సనాతన ధర్మ పరిరక్షణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సనాతన ధర్యంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా సనాతన ధర్మం విరాజిల్లుతుందని కొనియాడారు. దేశ నలుమూల నుంచి వచ్చిన స్వామీజీలు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కాషాయానికి విలువ పెరుగుతుందని, మహా కుంభమేళాలో 15కోట్ల మంది హిందువులు పాల్గొన్నారని కొనియాడారు. హిందువుల్లో ఐక్యత లేక సనాతన ధర్మం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు సనాతన ధర్మం కోసం కృషి చేయాలన్నారు. ఇతర మతస్తుల దాడులను ఎదుర్కొనేందుకు ప్రతి హిందువు సన్నద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ బీరెల్లి చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జాతీయ స్వామీజీ, పీఠాధిపతి సాధువుల అధ్యక్షుడు అంబికేశ్వరానంద స్వామీజీ, కక్కిరేని చంద్రశేఖర్, రాచర్ల కమలాకర్, ఈగ దయాకర్, బ్రాహ్మణపల్లి మురళీధర్, నూకా వెంకటేశంగుప్తా తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి