
గడపగడపన మడుగే..
ఫ వర్షానికి ఆలేరు పట్టణంలో
ముంపునకు గురైన కాలనీలు
ఫ రాత్రంతా నిద్రలేకుండా గడిపిన ప్రజలు
ఆలేరు: ఆలేరు పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి రంగ నాయకుల వీధి, కుమ్మరివాడ, పాత మున్సిపల్ కార్యాలయం, ప్రగతి స్కూల్, బ్రహ్మంగారి ఆలయం నుంచి ఈదమ్మ గుడి వరకు పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. నడుము లోతు వరకు వరద నీరు ప్రవహించింది. దాంతో ఆయా ప్రాంతాల ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. దాదాపు 40 ఇళ్లలోకి నీరు చేరింది. నీటిని తొలగించడానికి నానా అవస్థలు పడ్డారు. సరుకులు, దుస్తులు పూర్తిగా తడిసాయని, భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఉంటుందని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఆరు ఇళ్ల గోడలు కూలిపోయాయి. రంగానాయకుల వీధిలో పట్ట నవీన్‌కు చెందిన ఆటోపై గోడ కూలి పడటంతో ధ్వంసమైంది.

గడపగడపన మడుగే..