
సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా..
అక్రమాలను వెలికితీసి, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సాక్షి ఎంతగానో కృషి చేస్తుంది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మీడియా, మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం కూటమి సర్కార్‌కు తగదు. నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ది చెబుతారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి. మీడియా గౌరవాన్ని కాపాడాలే తప్ప.. స్వేచ్ఛకు విఘాతం కలిగించొద్దు. ప్రజా సమస్యలపై ప్రశిస్తే కేసులు పెట్టడం సరైంది కాదు.
–బండి జంగమ్మ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి
జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను అణచివేయాలని చూడటం నియంతపాలనకు నిదర్శనం. ప్రజా సమస్యలపై వార్తలు రాస్తే ఆత్మ విమర్శ చేసుకొని సరిదిద్దుకోవాలే తప్ప.. కక్షపూర్తి చర్యలకు పాల్పడటం తగదు. శ్రీసాక్షిశ్రీ ఎడిటర్‌పై కేసులు బనాయించడం అంటే కిందస్థాయి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ప్రభుత్వాలు ప్రజల మెప్పు పొందలేవు.
–డబ్బేటి సోంబాబు,
టీయూడబ్ల్యూజే యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు

సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా..