
ముమ్మరంగా సహాయక చర్యలు
ముంపు ప్రాంతాల్లో శుక్రవారం అధికారులు, మాన్‌సూన్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. బాధితులకు అల్పాహారం, భోజనం అందజేశారు. జేసీబీ సహాయంతో వరద నీటిని, చెత్తను తొలగించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ముంపు ప్రాంతాల్లో నిలిచిన వరదనీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐఅయ్య ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ ఫౌడర్ చల్లించాలని సూచించారు. నష్టంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆస్తినష్టం తప్ప, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.