
దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం..
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ పట్ల రాజకీయ పార్టీలకు గౌరవంగా ఉండాలి. ప్రస్తు తం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై అందులో పనిచేసే సిబ్బందిపై దాడులకు దిగడం, పోలీసుల చేత కేసులు పెట్టించడం పత్రికా స్వేచ్ఛను హరించేయడమే. దీనిని టీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలు, పాత్రికేయుల్లో విభిన్న సైదాంతిక భావజాలంతోపాటు వివిధ వర్గాల ప్రజలు ఉంటారు. అధికార బలంతో సాక్షి సిబ్బందిపై పోలీసులు దాడులు చేయడం, నోటీసులు అందజేయడం బాధాకరం.
– వివేకానంద, టీడబ్ల్యూజేఎఫ్, రాష్ట్ర కార్యదర్శి