
16న మత్స్యగిరి ఆలయంలో టెండర్లు
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వివిధ వస్తువుల సరఫరాకు ఈ నెల 16న టెండర్లు ఆహ్వానిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహనబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాల్ పోస్టర్ ప్రింటింగ్, తడకల పందిర్లు, ఆర్చీలు వేయుట, టికెట్ పుస్తకాలు, స్టేషనరీ ప్రింటింగ్, ఫ్లెక్సీ బ్యానర్లు, సున్నం రంగులు వేయుట, రోజు వారీగా పాలు, పెరుగు, కూరగాయలు, విద్యుత్ పరికరాలు, డెకరేషన్, మైకుసెట్, వివిధ వస్తువుల సరఫరాకు ఏడాది కాలానికి గాను టెండర్లు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
గంజాయి బారిన
పడకుండా చూడాలి
సాక్షి.యాదాద్రి : యువత గంజాయి బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో జిల్లాలో గంజాయి నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో జిల్లా అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ, విద్యా, వైద్య, పోలీస్, ఎకై ్సజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఎకై ్సజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాధాకృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, డీఎంహెచ్‌ఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గురువారం అందుబాటులోఉంటా..
భువనగిరిటౌన్ : పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటానని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం భువనగిరి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. పలు దరఖాస్తులను స్వీకరించి ఆయా సమస్యలను పరిష్కరించాలని ఫోన్ ద్వారా సదరు అధికారులను ఆదేశించారు.
రెండు కంపెనీల మూసివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు
యాదగిరిగుట్ట: మోటకొండూర్ మండలం కాటేపల్లిలో నిర్వహిస్తున్న టైర్ల కంపెనీలైన మహతి ఇండస్ట్రీస్, శ్రీజ ఇండస్ట్రీస్ మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీచేసింది. కొంత కాలంగా ఈ రెండు కంపెనీల్లో టైర్లు కాల్చి, రీసైక్లింగ్ చేస్తున్నారు. దీంతో వాతావరణం కలుషితమై దుర్వాసన రావడంతో పాటు కంపెనీల నుంచి వచ్చే బూడిదతో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ కంపెనీలను తొలగించాలని రైతులు, గ్రామస్తులు ఉద్యమించారు. గ్రామస్తులతో పాటు ఇదే గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ మంత్రి సుభాష్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కంపెనీలపై ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. మహతి ఇండస్ట్రీ, శ్రీజ ఇండస్ట్రీస్‌లను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులపై కాటేపల్లి రైతులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కోసం ఇంగ్లాడ్ నుంచి వచ్చి తమకు అండగా పోరాటం చేసి, కంపెనీలను మూసివేతకు ఉద్యమించిన మంత్రి సుభాష్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు గురువారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు.

16న మత్స్యగిరి ఆలయంలో టెండర్లు