
భూదానయజ్ఞ బోర్డు పునరుద్ధరణకు కృషి
భూదాన్‌పోచంపల్లి : భూదానయజ్ఞ బోర్డు పునరుద్ధరణకు కృషిచేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో వినోబాభావే సేవాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భూదానోద్యమ పితామహుడు వినోబాభావే 130వ జయంతి ఉత్సవాలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోబాభావే, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూదానబోర్డును రద్దుచేసి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వందలాది ఎకరాల భూదాన భూములను అన్యాక్రాంతం చేసిందని విమర్శించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్న భూదానోద్యమ వజ్రోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు.
చరిత్రపుటల్లో పోచంపల్లి : ఎంపీ చామల
వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డిల భూదా నోద్యమ స్ఫూర్తితో పోచంపల్లి పేరు చరిత్రపుటల్లో నిలిచిపోయిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం భూదాన భూముల డేటా లేకుండా చేసి అనేక అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భూదానబోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తడక వెంకటేశ్వర్లు, పాక మల్లేశ్, భారత లవకుమార్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్‌రెడ్డి, తడక రమేశ్, తడక యాదగిరి, అంబరీష్‌రెడ్డి, సీత శ్రీరాములు, కుక్క దానయ్య, కొట్టం కరుణాకర్‌రెడ్డి, గునిగంటి రమేశ్, గునిగంటి వెంకటేశ్, కొయ్యడ శ్రీను, మెరుగు శశికళ, కాసుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
ఫ పోచంపల్లిలో వినోబాభావే జయంతి వేడుకలు
ఫ హాజరైన ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి