
అనుమతి లేని క్లినిక్ సీజ్
తుంగతుర్తి: అనుమతులు లేకుండా నడిపిస్తున్న క్లినిక్‌ను సూర్యాపేట జిల్లా ఉప వైద్యాధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో సర్గం సంపత్‌కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీసంజీవని మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నడిపిస్తున్నాడు. అంతేకాకుండా అందులో అనధికారికంగా రోగులకు చికిత్స కూడా చేస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో తనిఖీ చేసినట్లు సూర్యాపేట జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు జయ మనోహరి, జి. చంద్రశేఖర్ తెలిపారు. సంపత్‌కుమార్ ఎలాంటి అర్హత లేకున్నా రోగులకు ఇంజెక్షన్లు, గ్లూకోజ్‌లు అందిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ మేరకు క్లినిక్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. వారి వెంట జిల్లా ఎంహెచ్‌ఎన్ ప్రోగ్రాం అధికారి నాజియా తబస్సుం, జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి ఆశ్రిత తదితరులు ఉన్నారు.