
ఇంటికి చేరుకున్న హాస్టల్ విద్యార్థి
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట గ్రామ పరిధిలోని నేతాజీ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలుర హాస్టల్ నుంచి మంగళవారం అదృశ్యమైన విద్యార్థి తన ఇంటికి చేరుకున్నాడు. గద్వాల జిల్లా లతిపురం గ్రామానికి చెందిన విద్యార్థి గొల్లతిప్పడంపల్లి శ్రీకాంత్ మంగళవారం ఉదయం 9 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిపోయి కొత్తగూడెం వద్ద బస్సు ఎక్కి హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుండి రైలు ఎక్కి గద్వాలలో దిగి స్వగ్రామం లతిపురం చేరుకున్నాడు. శ్రీకాంత్ తండ్రి వెంటనే ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి తన కొడుకు ఇంటికి వచ్చిన విషయాన్ని చెప్పాడు. హాస్టల్‌లో ఉండలేక తల్లిదండ్రులను చూడాలని విద్యార్థి టీచర్లకు చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది.