
పంట మార్పిడితో లాభాల బాటలో..
తుర్కపల్లి: ఎప్పుడూ ఒకే రకం పంట సాగుచేసి నష్టాలపాలవ్వకుండా ప్రతి ఏడాది వేర్వేరు పంటలు సాగుచేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు తుర్కపల్లి మండలం నాగాయపల్లికి చెందిన రైతు లకావత్ అంజయ్య, ఆయన కుమారులు మంగ్తా, మోహన్. వారు అనుసరిస్తున్న పద్ధతి పలువురు రైతులకు ఆదర్శంగా మారింది. లకావత్ అంజయ్య కుటుంబ సభ్యులు గతంలో వరి సాగు చేసేవారు. అధిక పెట్టుబడి, నీటి వినియోగం, ఆరు నెలల నిరీక్షణ వంటి సమస్యలతో కూరగాయలు, పూలు, పండ్ల తోటల సాగువైపు అడుగులు వేశారు. గతేడాది వంకాయ పంట వేసి మంచి లాభాలు పొందారు. ఈ ఏడాది బొప్పాయి సాగుపై దృష్టి సారించారు.
మూడు ఎకరాల్లో మూడు వేల మొక్కలు..
మిత్తం మూడు ఎకరాల్లో మూడు వేల బొప్పాయి మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు రూ.20 ఖర్చు కాగా.. దున్నకాలు, పేడ, ఎరువులు, డ్రిప్ సదుపాయం ఇతరత్రా కలసి మొత్తం రూ.2.5లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఎనిమిది నెలల్లోనే పండ్లు రావడం ప్రారంభమై.. సంవత్సరం పొడువునా దిగుబడి వస్తుంది. తెగుళ్ల నివారణ కోసం వారానికి ఒకసారి మందులు పిచికారీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా బొప్పాయి తోటలో అంతర పంటగా బంతి పూల సాగు కూడా చేపట్టారు. మొదటి కోతలోనే రెండు టన్నుల దిగుబడి వచ్చిందని, వారానికి ఒకసారి పూలు కోసి మార్కెట్‌కు తరలిస్తున్నట్లు రైతు అంజయ్య, ఆయన కుమారులు పేర్కొన్నారు. పెట్టుబడి ఖర్చు రూ.2.5 లక్షలు కాగా.. ప్రకృతి అనుకూలించి, మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తే సుమారు రూ.6లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఫ ప్రతి ఏడాది వేర్వేరు పంటలు
సాగు చేస్తున్న తుర్కపల్లి మండలం నాగాయపల్లికి చెందిన రైతు
ఫ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేలా ప్రణాళికలు

పంట మార్పిడితో లాభాల బాటలో..

పంట మార్పిడితో లాభాల బాటలో..