
రీజినల్ రింగ్ రోడ్డు మాకొద్దు
గట్టుప్పల్: రీజినల్ రింగ్ రోడ్డు తమకొద్దని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం గటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భూముల కోల్పోతున్న రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రైతులు సారవంతమైన భూములు కోల్పోతున్నారని అన్నారు. భూములు కోల్పోతున్న వారికి భూమికి భూమి ఇవ్వాలని, ఓపెన్ వాల్యూయేషన్ మీద నాలుగు రెట్లు పెంచి ఇవ్వాలన్నారు. మహబూబ్‌నగర్, కల్వకుర్తి ప్రాంతాల్లో ఎకరానికి రూ.80 నుంచి రూ.90 లక్షల వరకు కొంతమంది రైతులకు ఇచ్చారని, మరికొందరికి రూ.కోటి వరకు కూడా ఇస్తున్నారని అన్నారు. నామాపురం, తేరట్‌పల్లి, వెల్మకన్నె రైతుల ఆమోదం లేకుండా అలైన్‌మెంట్ రూపొందించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ, సీపీఎం నాయకులు కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, అచ్చిన శ్రీనివాస్, పగిళ్ల శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు టి. శంకర్, ఇడెం కై లాసం, బాలం శ్రీను, అయితరాజు హనుమంతు, బండ లింగయ్య, పగిళ్ల నరసింహ, నల్లవెల్లి భిక్షం, పెద్దగాని నరసింహ, హనుమంతు, పగిళ్ల శంకర్, సాయిబాబా, శంకర్, హరి, నరేష్, చిననరసింహ పాల్గొన్నారు.
ఫ గట్టుప్పల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా