
పరిశుభ్రత లోపిస్తే ఉపేక్షించేది లేదు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత లోపిస్తే ఉపేక్షించేది లేదని ఆలయ ఈఓ వెంకట్రావ్ అన్నారు. యాదగిరి కొండపైన బుధవారం ఆలయ పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన ఏజెన్సీ కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వామివారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నిబంధనల ప్రకారం సిబ్బంది ఏర్పాటు, సిబ్బంది పనితీరు, నాణ్యమైన మెటీరియల్ సరఫరా అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. పరిశుభ్రత విభాగంలో పనిచేసే సిబ్బంది, సూపర్‌వైజర్లు, క్లీనింగ్ సిబ్బంది విధిగా అటెండెన్స్, వర్క్ చార్జ్, డ్రెస్‌కోడ్ పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. పరిశుభ్రత నిర్వహణలో శాసీ్త్రయ, మెకనైజ్డ్ పద్ధతులు అవలంబించాలని, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు దయాకర్‌రెడ్డి, రామారావు, ఏఈఓలు, సీఎస్‌ఓ, సంబంధిత పర్యవేక్షకులు పాల్గొన్నారు.
ఫ యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్