
యువకుడిపై పోక్సో కేసు
కనగల్: కనగల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత బాలికపై అత్యాచారం చేసిన యువకుడిపై పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన గణేష్ శోభాయాత్ర కొనసాగుతుండగా యువకుడు బాలిక ఇంటికి వెళ్లి ఆమైపె అత్యాచారం చేశాడు. బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు, కుటుంబ సభ్యులు యువకుడిని బంధించే ప్రయత్నం చేశారు. అదే గ్రామానికి చెందిన యువకుడి స్నేహితులు ఇద్దరు అక్కడికి చేరుకొని బాధితురాలి తల్లిదండ్రుల నుంచి అతడిని తప్పించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులు కనగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి బుధవారం అత్యాచారం చేసిన యువకుడిపై పోక్సో కేసు, అతడికి సహకరించిన ఇద్దరు వ్యక్తులపై మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఊట్కూరు వాగులో
కొట్టుకుపోయిన వలస కూలీ
ఫ రక్షించిన యువకులు
నిడమనూరు: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిడమనూరు మండలంలోని ఊట్కూరు వాగులో ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. స్థానికంగా బొగ్గు బట్టీలో పనిచేసే వలస కూలీ మద్యం మత్తులో బుధవారం వాగులో పడి కొంత దూరం కొట్టుకపోయాడు. స్థానిక యువకులు అతడిని రక్షించారు.