
స్వచ్ఛ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరి: జిల్లాలోని పాఠశాలలు స్వచ్ఛ, హరిత పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం భువనగిరి మండలంలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎంఈఓలు, మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు, నీటి వినియోగం, విద్యార్థుల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, మొదలైన అంశాలపై రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దేశ వ్యాప్తంగా 200 పాఠశాలలను ఎంపిక చేసి పురస్కారాలు ఇస్తుందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఎంపికై న ఒక్కో పాఠశాలలకు రూ. లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 875 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ పురస్కారాల ఎంపిక కోసం ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలు అక్టోబర్‌లో తనిఖీలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఎంఈఓలు, మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయిలోని ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అండాలు, జిల్లా మాస్టర్ ట్రైనర్ కృష్ణప్రసాద్, ఎంఈఓలు పాల్గొన్నారు.
డీఈఓ సత్యనారాయణ