
మండుతున్న ఎండలు
భువనగిరి: వర్షాకాలంలో ఎండాకాలాన్ని తలపించేలా భానుడు తనప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండవేడిమితో జనం ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో కనిష్టంగా 25 డిగ్రీలు, గరిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు ఉండగా గరిష్ట ఉష్ణోగ్రతలు 37.3 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
తగ్గని ఉక్కపోత
భారీ వర్షాలు కురిసి మందగించిన తర్వాత కూడా ఉక్కపోత ఏమాత్రం తగ్గలేదు. సెప్టెంబర్‌లోనూ ఏసీలు, కూలర్లను, ఫ్యాన్లు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలకు బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. మరో వైపు ఉక్కపోతతో ఒక్కరిబిక్కరి అవుతున్నారు.
ఈనెలలో నమోదైన ఉష్ణోగ్రతల
వివరాలు (డిగ్రీలలో)
తేదీ కనిష్ట గరిష్ట
6వ తేదీ 30.4 35.8
7 29.3 35.1
8 30.7 36.0
9 30.6 37.3
గత నాలుగు రోజుల నుంచి క్రమంగా
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం