
ఉదయ్‌పూర్‌లో తెలంగాణ టీచర్ల ప్రదర్శన
నకిరేకల్: రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో గల సాంస్కృతిక వనరుల కేంద్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఉత్తమ సాధక ఉపాధ్యాయుల శిక్షణలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఉపాధ్యాయులు మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలపై నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ బృందానికి నకిరేకల్ మండలం చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం కనుకుంట్ల నవీన్‌రెడ్డి సారథిగా వ్యహరించి ప్రశంసలు అందుకున్నారు. మొత్తం 13 రాష్ట్రాల ఉపాధ్యాయులు పాల్గొని వివిధ ప్రదర్శనలు ఇచ్చారు. 14వ రోజు తెలంగాణ బృందం గ్రామీణ ప్రజల పని సంస్కృతి(ఊరు మనదిరా) బోనాలు, బతుకమ్మ, బంజారా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనను సీసీఆర్టీ అధికారులు అభిషేక్ సర్కార్, హితేష్, పనెరి అభినందించారు. ఈ ప్రదర్శనలో తనతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి మాదరి ఎల్లన్న, పి. రఘురాం, జి. వెంకటేష్, ఈశ్వరయ్య, వి. అంజని, జయంత్‌కుమార్, ఎ. సౌజన్య, నిఖత్ ఫాతిమా, డి. రమేష్ పాల్గొన్నారని నవీన్‌రెడ్డి తెలిపారు.