
ఎంజీయూలో క్రీడాపోటీలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్: ఎంజీ యూనివర్సిటీలో సోమవారం అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొని రాణించాలన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతత, దేహదారుడ్యం పెరుగుతుందన్నారు. విద్యార్థుల నాయకత్వ లక్షణానికి క్రీడలు దోహదపడుతాయని తెలిపారు. ప్రతి కళాశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రోజు ఏదో ఒక క్రీడలో విద్యార్థులు పాల్గొనే విధంగా చూడాలని పేర్కొన్నారు. మహిళా విభాగంలో ఫైనల్ పోటీలు తెలంగాణ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల నల్లగొండ, తెలంగాణ ఆర్మీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల భువనగిరి మధ్య జరగనున్నట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ హరీష్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మద్దిలేటి, మురళి, శ్రీనివాస్‌రెడ్డి, శివశంకర్, వ్యాయామ ఉపాధ్యాయులు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.