
చదివింది పీజీ.. చేస్తోంది పారిశుద్ధ్య పని
మిర్యాలగూడ టౌన్: పీజీ చదివిన యువకుడు కుటుంబ పోషణ కోసం పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన అవిరెండ్ల సందీప్ పీజీ చదివాడు. సందీప్ తల్లి ధనమ్మ చాలకాలం వరకు మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసింది. ఆమె ఆనారోగ్యానికి గురికావడంతో 2021లో తల్లి స్థానంలో సందీప్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. అయితే పీజీ చేసిన సందీప్ పారిశుద్ధ్య కార్మికుడిగా మురుగు కాలువలను శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, గడ్డి తీయడం వంటి పనులు పని చేస్తున్నాడు. తన చదువు తగినట్లుగా మున్సిపాలిటీలో ఏదైనా రాత పని ఇప్పించాలని వేడుకుంటున్నాడు.