
ఆలయ అభివృద్ధిపై సమావేశం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించేందుకు గాను హరే కృష్ణ మూమెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస స్వామిజీ, ఆయన బృందంతో ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదివారం సమావేశమయ్యారు. ఆలయంలో ఎలాంటి వైధిక, ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలనే విషయాలను ఈఓ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించి, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని హరే కృష్ణ మూమెంట్ బృందాన్ని ఈఓ కోరారు. ఈ సమావేశంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్‌శర్మ పాల్గొన్నారు.