
జాతీయ పోటీలకు ఎంపిక
పెద్దవూర: జాతీయస్థాయి ట్రిబు ల్ జంప్ పోటీలకు పెద్దవూర మండలం నాయనవానికుంట గ్రామానికి చెందిన నడ్డి బాలరాజు యాదవ్, అంజలి దంపతుల కుమారుడు జతీన్‌యాదవ్ ఎంపికయ్యాడు. గత నెల ఏపీలోని నెల్లూరులో నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి అండర్–19 సీబీఎస్‌సీ క్లస్టర్ ట్రిబుల్ జంప్ పోటీల్లో జతీన్‌యాదవ్ పాల్గొని రజత పతకం సాధించాడు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన జతీన్‌యాదవ్ ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జతీన్‌యాదవ్ ఎంపిక పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.