స్ప్రేయర్ల ఎంపిక కీలకం | - | Sakshi
Sakshi News home page

స్ప్రేయర్ల ఎంపిక కీలకం

Sep 8 2025 4:35 AM | Updated on Sep 8 2025 4:35 AM

స్ప్ర

స్ప్రేయర్ల ఎంపిక కీలకం

ఫుట్‌ స్ప్రేయర్‌

ఇది కాళ్లతో పనిచేస్తుంది. మినుము, పెసర వంటి పంటలతో పాటు కూరగాయ తోటలు, మామిడి, బత్తాయి వంటి పండ్లతోటల్లో సస్యరక్షణ మందులను పిచికారీ చేయొచ్చు. రోజుకు రెండు ఎకరాల్లో, పండ్ల తోటల్లో సగటున రోజుకు 150 చెట్లకు పిచికారీ చేయొచ్చు. ధర రూ.4వేల లోపే ఉంటుంది. ఇత్తడితో తయారైన పుట్‌స్ప్రేయర్‌లో ప్రధానంగా చిన్న బ్యారల్‌, కదిలే పిస్టన్‌ ఉంటుంది. బ్యారల్‌ అడుగుభాగానికి ప్లాస్టిక్‌ గొట్టం కలపబడి ఉంటుంది. రెండో చివరన ఫిల్టర్‌ గరాటు బిగించబడి ఒక పాత్రలోని రసాయన ద్రావణంలో మునిగి ఉంటుంది. పెడల్‌ను కాళ్లతో తొక్కినప్పుడు పిస్టన్‌ బ్యారల్‌లో పైకి కిందికి కదలడంతో ద్రావణం బ్యారల్‌ పైభాగానికి చేరి అక్కడి నుంచి గాలి గది ద్వారా రెండో గొట్టం చివర ఉన్న నాజిల్‌ గుండా బయటకు వెళ్తుంది. గాలి గది అమరిక వల్ల ద్రావణంపై పీడనం ఎల్లప్పుడు సమానంగా ఉంచి పిచికారీ ఒకే విధంగా ఉండటానికి తోడ్పడుతుంది. దీనిలో చదరపు సెంటీమీటర్‌కు 8 నుంచి 13 కిలోల ఒత్తిడి తీసుకురావచ్చు. అధిక ఒత్తిడి వలన ఎత్తుగా ఉన్న మామిడి చెట్లకు సులభంగా పిచికారీ చేయొచ్చు.

పెద్దవూర: మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలను పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో రైతులకు పంటలపై ఒకటికి రెండుసార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం పరిపాటిగా మారింది. పిచికారీ చేసేందుకు అవసరమైన స్ప్రేయర్లను సరిగ్గా ఎంపిక చేసుకోకపోతే రసాయన మందులు వృథా కావడంతో పాటు పిచికారీ చేసే వ్యక్తి శరీరంపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం పత్తి, మిరప, వరి పంటలకు చీడపీడల బెడదతో పాటు తెగుళ్లు విజృంభిస్తున్నాయి. రైతులు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల స్ప్రేయర్లకు సంబంధించిన విషయాలను పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్‌ వివరించారు.

తైవాన్‌ పవర్‌ స్ప్రేయర్‌..

ఇటీవల అన్ని రకరాల పంటలకు తైవాన్‌ పవర్‌ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తున్నారు. దీని ఖరీదు కంపెనీలను బట్టి రూ.20వేల వరకు ఉంటుంది. దీనికి తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో వెదజల్లే సామర్థ్యం ఉంది. ఇతర వాటితో పోల్చితే దీనిలో సస్యరక్షణ మందులు మూడు వంతులు అధికంగా పోయాల్సి ఉంటుంది. రోజుకు సగటున 8 నుంచి 10 ఎకరాల్లో పిచికారీ చేయొచ్చు. దీనికి అమర్చిన బెల్డ్‌ ద్వారా భుజాల వెనుక సులభంగా తగిలించుకోవచ్చు. ఈ పవర్‌ స్ప్రేయర్‌ చదరపు సెంటీమీటర్‌కు 30–35 కిలోల ఒత్తిడిని కలగజేస్తుంది. ధ్వని కాలుష్యం తక్కువ, ఒకేసారి 20 అడుగుల వెడల్పుతో పిచికారీ చేయొచ్చు. మందు వేగం గంటకు 60 కి.మీ. ఇంజిన్‌ సహాయంతో గాలి అధిక ఒత్తిడితో బయటకు రావడం వలన మందును స్ప్రేయర్‌ నాజిల్‌ 150–200 మైక్రాన్‌ సైజుతో ఉండే చిన్నచిన్న బిందువులుగా విడగొట్టి అధిక విస్తీర్ణంలో మందు పడేలా చేస్తుంది. నీటి బిందువులు గుండ్రంగా తిరగడం వలన ఆకుల పైభాగాన, కింది భాగాన పడతాయి. ఇంజిన్‌ పనిచేయడానికి గంటకు లీటర్‌ పెట్రోల్‌ అవసరం అవుతుంది. లీటర్‌ పెట్రోల్‌ ఆరు ఎకరాలకు సరిపోతుంది. నిమిషానికి 7.2 లీటర్ల మందును చల్లవచ్చు. బరువు తొమ్మిది కిలోలు ఉంటుంది. దీనిలో 20 లీటర్ల రసాయం ద్రావణం, 900 మి.లీ. పెట్రోల్‌ పడుతుంది. ఇటీవల వచ్చిన ఆధునాతన పవర్‌ స్ప్రేయర్‌లతో ఒక వ్యక్తి మందు ద్రావణ డబ్బాను భుజానికి తగిలించుకుంటే రెండు వైపులా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో రసాయన మందును పిచికారీ చేయొచ్చు.

నాప్‌సాక్‌ స్ప్రేయర్‌

దీని బరువు తక్కువగా ఉండేందుకు పాలిథిన్‌తో తయారు చేశారు. స్ప్రేయర్‌ ట్యాంకు పరిమాణం 15–16 లీటర్లు. దీనికి ఉన్న బెల్టుల ద్వారా భుజాల వెనక సులువుగా తగిలించుకోవచ్చు. పంట అన్ని దశల్లో మందు పిచికారీకి స్ప్రేయర్‌ సులువుగా ఉపయోగపడుతుంది. ధర రూ.2వేల లోపే ఉంటుంది. ట్యాంకు లోపలి భాగాన పంపు, గాలి గది, పైభాగాన ఒక రంధ్రానికి ప్లాస్టిక్‌ గొట్టం బిగించబడి ఉంటుంది. రెండో చివర నాజిల్‌ ఉంటుంది. ట్యాంకులో అమర్చబడిన పిస్టన్‌ పైకి కిందకు కదలడం వలన ద్రావణంపై ఒత్తిడి ఏర్పడి రబ్బరు గొట్టం ద్వారా నాజిల్‌ ద్వారా బయటకు వెలువడుతుంది. పిస్టన్‌ కదిలించటానికి హ్యాండిల్‌ ఉంటుంది. దీనితో రసాయన ద్రావణం అంతటా సమంగా పడుతుంది.

సరైంది ఎంచుకోకపోతే రసాయనం వృథా

స్ప్రేయర్ల ఎంపిక కీలకం1
1/2

స్ప్రేయర్ల ఎంపిక కీలకం

స్ప్రేయర్ల ఎంపిక కీలకం2
2/2

స్ప్రేయర్ల ఎంపిక కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement