గంజాయి మత్తులో.. ఆన్‌లైన్‌ ఉచ్చులో.. | - | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో.. ఆన్‌లైన్‌ ఉచ్చులో..

Sep 8 2025 4:35 AM | Updated on Sep 8 2025 4:35 AM

గంజాయ

గంజాయి మత్తులో.. ఆన్‌లైన్‌ ఉచ్చులో..

బెల్ట్‌ షాపులు తీసివేయాలి

వ్యసనాలకు దూరంగా ఉండాలి

ఆలేరురూరల్‌: పట్టణాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ గేమ్స్‌, క్రికెట్‌ బెట్టింగ్‌, గంజాయి మత్తు క్రమక్రమంగా పల్లెలకు కూడా పాకుతోంది. అంతేకాకుండా గ్రామాల్లో బెల్ట్‌ షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటుండడంతో యువత మద్యానికి బానిసలవుతున్నారు. గతంలో పల్లెల్లో విచ్చలవిడిగా ఉన్న గుడుంబా దుకాణాలు ప్రస్తుతం కనిపించకుండా చేసిన అధికారులు.. బెల్ట్‌ షాపులను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఆలేరు బైపాస్‌ రోడ్డులో రాత్రి సమయంలో ప్రతి షాపులో మద్యం అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయి. ఆలేరు మండలంతో పాటు మిగతా మండలాల్లోని గ్రామాలు, మండల కేంద్రాల్లో యువత గంజాయికి అలవాటు పడుతూ తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఎంత మందలించినా మార్పు ఉండడం లేదని కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. కొంత మంది యువత గంజాయి మత్తుకు బానిసై చదువు మధ్యలోనే ఆపేసి అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు. మరికొందరు గంజాయి సేవించడానికి అప్పులు చేస్తూ తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ప్రధానంగా ఇటు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాలను కేంద్రంగా చేసుకొని గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోంది. మత్తులో బలవన్మరణాలతో పాటు హత్య చేసే స్థాయికి దిగజారుతున్నారు.

ఈజీ మనీకి అలవాటు పడి..

యువత ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడటం, క్రికెట్‌ బెట్టింగ్‌లు పెట్టి నష్టపోతున్నారు. ఆలేరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఇటీవల ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటై అప్పులపాలయ్యాడు. అతడి కుటుంబ సభ్యులు కొంత పొలం అమ్మి అప్పులు తీర్చారు. పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆన్‌లైన్‌ గేమ్స్‌, క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు గంజాయి, బెల్ట్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని పల్లె ప్రజలు కోరుతున్నారు.

పల్లెల్లో బెల్ట్‌ షాపుల వలన యువత చెడిపోతున్నారు. మద్యం దుకాణాలను మండల కేంద్రాలకు మాత్రమే పరిమితం చేయాలి. బెల్ట్‌ షాపులు గ్రామాల్లో 24 గంటలు అందుబాటులో ఉండటంతో తాగుడుకు బానిసలవుతున్నారు. ఇంట్లో పెద్దలు తాగి గొడవలు చేస్తుండటంతో పిల్లలు కూడా అదే తోవ పడుతున్నారు.

– బైరి మహేందర్‌గౌడ్‌, సాయిగూడెం

గ్రామాలకు విస్తరిస్తున్న

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గంజాయి

చెడు వ్యసనాలకు

ఆకర్షితులవుతున్న యువత

చెడు వ్యసనాలకు, గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలి. పిల్లలు కదలికలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

– యాలాద్రి ఎస్‌హెచ్‌ఓ, ఆలేరు పోలీస్‌ స్టేషన్‌

గంజాయి మత్తులో.. ఆన్‌లైన్‌ ఉచ్చులో..1
1/2

గంజాయి మత్తులో.. ఆన్‌లైన్‌ ఉచ్చులో..

గంజాయి మత్తులో.. ఆన్‌లైన్‌ ఉచ్చులో..2
2/2

గంజాయి మత్తులో.. ఆన్‌లైన్‌ ఉచ్చులో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement