
యూరియా సరిపడా సరఫరా చేయాలి
భువనగిరిటౌన్ : యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, అవసరం మేరకు పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ చేశారు. శుక్రవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. రైతులు వేకువజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా జాప్యం చేయకుండా రైతులకు సరిపడా యూరియా అందించాలి కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరు బాలరాజు, దాసరి పాండు తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్