
గ్యాస్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీలో తనిఖీలు
బొమ్మలరామారం: మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో గల కీర్తి పెట్రో కమ్ గ్యాస్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీని శుక్రవారం జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి కందగడ్ల వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. 15 కమర్షియల్ సిలిండర్లలో తక్కువ పరిమాణంలో గ్యాస్ రీఫిల్ చేసినట్లు అధికారులు గుర్తించి సిలిండర్‌లను సీజ్ చేసినట్లు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో
వ్యక్తి ఆత్మహత్య
నకిరేకల్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన దుబ్బాక యాదగిరి అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో మద్యం బాటిల్‌లో పురుగులు మందు కలుపుకుని తాగాడు. అపస్మారక స్థితిలో ఉండడంతో కుటుంబీకులు యాదగిరిని నకిరేకల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
డీజే నిర్వాహకుడిపై కేసు
చివ్వెంల(సూర్యాపేట): గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా చివ్వెంల మండల పరిధిలోని జగన్నాయక్ తండాలో డీజే నిర్వహిస్తున్న మండల పరిధిలోని రామ్‌కోటి తండాకు చెందిన ధరావతు శివపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేశ్వర్ శుక్రవారం తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా డీజే పెడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.